కివీస్ గడ్డపై చారిత్రాత్మక విజయాన్ని సాధించిన టీం ఇండియా ఆటగాళ్లు గురువారం స్వదేశానికి చేరుకున్నారు. దేశరాజధాని నగరమైన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న టీం ఇండియా సారధి మహేంద్ర సింగ్‌తో పాటు గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, పేసర్ ఇషాంత్ శర్మ, స్పిన్నర్ మిశ్రాలకు అభిమానులు, బీసీసీఐ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. వీరిలో భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నేరుగా ముంబై చేరుకున్నాడు.
టీం ఇండియా వైస్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్, సతీమణి ఆర్తి, ఇషాంత్ శర్మ తండ్రి విజయ్ శర్మలు ఎయిర్పోర్ట్ చేరుకుని క్రికెటర్లకు స్వాగతం పలికారు. అయితే ఆటగాళ్ల భద్రతా కారణాల రీత్యా మీడియాను ఆటగాళ్లకు వద్దకు భద్రతా సిబ్బంది అనుమతించలేదు.
ఇదిలా ఉండగా.. కివీస్ గడ్డపై జరిగిన మూడు టెస్ట్ సిరీస్‌లో టీం ఇండియా 1-0 తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన వెల్లింగ్టన్ టెస్టు డ్రా కాగా, నేపియర్‌లో జరిగిన రెండో టెస్టు కూడా డ్రాగా ముగిసింది. ఇకపోతే.. హామిల్టన్‌లో జరిగిన తొలి టెస్టు సిరీస్‌ను కివీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.