పూర్తి వివరాలు చూస్తే... దేవరకొండకు చెందిన సతీశ్, అనంత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. ఐతే అనంత గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ధనుష్ అనే యువకుడితో సన్నిహితంగా వుంటూ వస్తోంది. అది కాస్తా ప్రేమకి దారి తీసి ఇద్దరూ కలిసి ఎవరికీ చెప్పకుండా పారిపోయారు. తన భార్యను ఎత్తుకెళ్లిపోయిన ధనుష్ ఆచూకి కోసం గత ఏడాదిగా వెతుకుతున్న సతీష్‌కి వారు హుజూరుబాద్‌లో వున్నట్లు తెలుసుకున్నాడు.
తన మిత్రుల సహాయంతో కారులో వెళ్లి ధనుష్‌ను కిడ్నాప్ చేసి కేసీ కెనాల్ వద్దకు తీసుకుని వెళ్లి దాడి చేసారు. అటుగా వెళ్తున్న స్థానికులు ఇది గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు. ఐతే ఆ కారులో ధనుష్ కనిపించలేదు. ఏమయ్యాడని అడిగితే... అతడు తప్పించుకుని పారిపోయాడని చెప్పారు. కానీ... అతడు నిజంగానే తప్పించుకున్నాడా లేదంటే వీరే ఏదైనా చేసి అబద్ధం ఆడుతున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.