వివాహేతర సంబంధం.. మంచం కింద డిటోనేటర్లు పెట్టి వీఆర్ఏ హత్య

ఠాగూర్

సోమవారం, 30 సెప్టెంబరు 2024 (10:41 IST)
వివాహేతర సంబంధం ఓ హత్యకు దారితీసింది. నిద్రిస్తున్న సమయంలో మంచం కింద డిటోనేటర్లు అమర్చి పేల్చడంతో వీఆర్ఏ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. వీఆర్ఏ నరసింహా అనే వ్యక్తి తన ఇంట్లో నిద్రిస్తుండగా బాబు అనే వ్యక్తి మంచి కింద డిటోనేటర్లు పెట్టి పేల్చాడు. దీంతో నరసింహం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు. నిందితుడు బాబును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీఆర్ఏ నరిసింహంకు బాబు అనే వ్యక్తి భార్యతో సంబంధం ఉండటం వల్లే ఈ దారుణం జరిగినట్టు సమాచారం, కాగా, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నరసింహం భార్య సుబ్బలక్ష్మమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు