ప్రియురాలిని దూరం చేసిందని... మహిళను కత్తితో పొడిచిన ఉన్మాది (Video)

సెల్వి

శనివారం, 27 జులై 2024 (10:10 IST)
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిని ఓ మహిళ తనకు దూరం చేయడాన్ని ఆ ప్రియుడు తట్టుకోలేకపోయాడు. దీంతో తన ప్రియురాలిని దూరం చేసిన మహిళపై పగ తీర్చుకున్నాడు. ఆమెను కత్తితో పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన బెంగుళూరు నగరంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ప్రియురాలిని దూరం చేసిన కృతి (24) అనే మహిళ బెంగళూరులోని ఓ పేయింగ్ గెస్ట్ హౌస్‌లో ఉంటుందన్న విషయం తెలుసుకున్న యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అమ్మాయి సహాయం కోసం అడగ్గా, పక్కనే ఉన్న అమ్మాయిలు పట్టించుకోకపోవడంతో కృతి మృతి చెందింది. యువకుడు తన ప్రియురాలిని తన నుండి దూరం చేసిందని కృతిపై దాడి చేసి, హత్య చేసినట్లు భావిస్తున్నారు. 


 

Sensitive Content

ప్రియురాలిని దూరం చేసిందని యువతిని కత్తితో పొడిచి చంపిన ఉన్మాది.

బెంగళూరులోని ఓ పేయింగ్ గెస్ట్ హౌస్‌లో ఉంటున్న కృతి(24) అనే యువతిపై ఓ యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

తీవ్రంగా గాయపడ్డ అమ్మాయి సహాయం కోసం అడగగా, పక్కనే ఉన్న అమ్మాయిలు… pic.twitter.com/SoZRWEbBwc

— Telugu Scribe (@TeluguScribe) July 27, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు