హైదరాబాద్‌: నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి.. సంప్‌లో పడి టెక్కీ మృతి

సెల్వి

సోమవారం, 22 ఏప్రియల్ 2024 (17:43 IST)
Sheikh Akmal
హైదరాబాద్ నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నిర్లక్ష్యం కారణంగా ఓ టెక్కీ ప్రాణాలు కోల్పోయాడు. గేటు ముందున్న నీటి సంప్ మూతపెట్టకుండా అలానే వదిలేయడంతో టెక్కీ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. ఇంటి ముందున్న నీటి సంప్‌ను తెరిచిపెట్టి వుంచారు. దానికి మూతపెట్టలేదు. ఏమవుతుందిలే అనుకున్నారేమో కానీ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ తతంగం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. 
 
ఈ ఫుటేజీలో 22 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి షేక్ అక్మల్ గచ్చిబౌలిలోని అంజయ నగర్‌లోని షణ్ముఖ్ పురుషుల పీజీ హాస్టల్‌లోకి గేటు తెరిచి, తెలియకుండానే ఓపెన్ సంప్‌లోకి పడిపోవడం చూడవచ్చు. చుట్టుపక్కల వారు కూడా అతను పడిపోయింది చూడలేదు. ఒక వ్యక్తి మాత్రం నీటి సంప్‌ను మూతపెట్టలేదని ఓ మహిళను తిట్టినట్లు కనిపించాడు. ఇంకా అందులో టెక్కీ పడిపోయాడనే విషయాన్ని గమనించినట్లు కూడా తెలియరాలేదు. 
 
ఆ వ్యక్తికి సంప్ తెరిచి వుందనే విషయం మాత్రమే తెలిసిందా.. లేకుంటే లోపల టెక్కీ వున్న విషయం తెలిసి కూడా అలా కూల్‌గా వ్యవహరించాడా అనేది తెలియరాలేదు. అయితే వీడియో ప్రకారం సంప్‌లో టెక్కీ పడిన శబ్ధాన్ని గమనించే సంప్‌ను మూతపెట్టలేదు అన్నట్లు తిడుతున్నట్లు కనిపించాడు. అయితే టెక్కీ సంప్‌లో పడిన తర్వాత కూడా వారిలో కంగారు కనిపించలేదు. మొత్తానికి టెక్కీ ప్రాణాలు మాత్రం గాలిలో కలిసి పోయాయి. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తును కొనసాగించారు. 

Scary & shocking: CCTV footage shows 22-yr-old software employee Sheikh Akmal opening gate & walking into Shanmukh Men's PG Hostel in Anjaya Nagar, Gachibowli & falls unwittingly into open sump; those around didn't even seem to realise he fell & died; Raidurgam police booked case pic.twitter.com/rqGmirCFMQ

— Uma Sudhir (@umasudhir) April 22, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు