నిన్ను నమ్మి వచ్చినందుకు నాకు బాగా శాస్తి చేస్తున్నావు చవట దద్దమ్మ అంటూ ప్రియురాలు తిట్ల దండకం అందుకుంది. అతడు కూడా తక్కువ తినలేదు. నీతో సహజీవనం చేస్తున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి, ఛ వెధవ జీవితం అంటూ మండిపడ్డాడు. ఇలా ఒకరికొకరు తిట్టుకుంటూ తారాస్థాయికి వెళ్లిపోయారు. ఎక్కడి దాకా అంటే.... ఆగ్రహంతో ప్రియుడు తన ప్రియురాలిని గదిలో గడియపెట్టి ఆమె చూస్తుండగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వద్దూ వద్దూ చచ్చిపోవద్దని ఎంత అరిచినా అతడు పట్టించుకోలేదు. నీతో వుండేకంటే చావడమే మంచిది అంటూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో ఆమె కూడా తన మణికట్టును బ్లేడుతో కోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. ఐతే విషయాన్ని పోలీసులకు చేరవేసింది. దీనితో హుటాహుటిని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ దారుణ ఘటన గౌహతిలోని కల్యాణ్ నగర్ కహిలిపురిలో చోటుచేసుకున్నది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... గత ఏడాదిగా నవజ్యోత్, సుస్మితా దాస్ సహజీవనం చేస్తున్నారు. తొలి మూడు నెలలు ఇద్దరూ ఎంతో సంతోషంగా కాలం గడిపారు. ఐతే ఆ తర్వాత ఇద్దరి మధ్య చీటికిమాటికి గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే చెలరేగిన ఘర్షణలో ప్రియుడు నవజ్యోత్ ఆత్మహత్య చేసుకోగా ప్రియురాలు సుస్మిత ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.