తెలంగాణ రాష్ట్రంలో విషాదకర ఘటన జరిగింది. భార్యపై అనుమానంతో కన్నబిడ్డకు విషమిచ్చి చంపేశాడో కసాయి తండ్రి. ఈ దారుణం జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఐజ పట్టమానికి చెందిన భార్గవ్ అనే వ్యక్తికి గత 2019తో వనపర్తి జిల్లా వీపనగుండ్ల మండలం, పెంట్లవెల్లికి చెందిన పల్లవి అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లయిన గత యేడాది వరకు వీరి సంసార జీవితం సాఫీగానే సాగిపోయింది. ఈ క్రమంలో కుమారుడు, కుమార్తె జన్మించాడు.
అయితే, పెళ్లయిన యేడాది నుంచే భార్యను భార్గవ్ వేధించసాగాడు. అనుమానంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా చేశాడు. చివరకు ఫోనులో కూడా మాట్లాడకుండా చేశారు. ఈ క్రమంలో భర్త వేధింపులు తాళలేని ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. అనుమానంతో ఇంట్లో గొలుసులతో కట్టేశాడని ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం భార్యాభర్తల మధ్య గొడలు రావడంతో తన పిల్లలతో కలిసి పుట్టింటింకి వచ్చింది. దీంతో భార్యపై భర్తకు మరింత కోపం పెరిగింది.
ఈ క్రమంలో గత నెల 29వ తేదీన ఎలుకలు మందు, నిద్రమాత్రలు కలిపి తన కుమారుడు నంద కిషోర్‌కు తాపించాడు. దీన్ని గమనించిన ఇరుగుపొరుగువారు సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణగండం నుంచి బయటపడ్డాడు. అప్పటికీ కసి తీరకపోవడంతో ఈ నెల 3వ తేదీన మరోమారు ఎలుకలు మందు, నిద్రమాత్రలు కలిపి చిన్నారికి తాగించి తాను కూడా తాగాడు. అయితే, కుమారుడు నంద కిషోర్ ప్రాణాలు కోల్పోగా, భార్గవ్ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.