కదిరి డీఎస్పీ శ్రీలత తెలిపిన మేరకు.. స్థానిక సారగుండ్లపల్లికి చెందిన నాగార్జున (32) వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ వలంటీరుగా పనిచేశాడు. రెండేళ్ల క్రితం అతనికీ వివాహమైంది. ఆదివారం తన భార్యను పుట్టింట్లో వదిలిపెట్టేందుకు వెళ్లిన నాగార్జున అదేరోజు రాత్రి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో అదే మార్గంలోని ఓ ఊరిలో దివ్యాంగ బాలిక, మరికొందరు చిన్నారులు కలిసి ఆడుకుంటూ కనిపించారు.
దీంతో నాగార్జున.. దివ్యాంగ బాలికను ముళ్ల పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఇది చూసిన చిన్నారులు కేకలు వేయడంతో గ్రామస్థులతో పాటు బాలిక తండ్రి అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా స్వగ్రామానికి పారిపోయాడు. అక్కడ నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రాసుకున్న సూసైడ్ నోట్ రాసి పెట్టగా, దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.