మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ లోని గజరాజా మెడికల్ కళాశాలలో ఓ జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం జరిగింది. జూనియర్ వైద్యురాలితో స్నేహంగా వుంటూ వస్తున్న మరో పురుష జూనియర్ డాక్టర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. నీతో మాట్లాడాల్సిన విషయం ఒకటుంది రమ్మని జూనియర్ వైద్యురాలికి ఫోన్ కాల్ చేసాడు. ఆమె అది నమ్మి అతడిని కలిసేందుకు వచ్చింది.