పెళ్లి పేరుతో అత్యాచారం చేసిన బాధితురాలినే విచారణ ఖైదీగా జైలులో ఉన్న నిందితుడు జైలు ప్రాంగణంలోనే వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒరిస్సాలోని గోచాబాదికి చెందిన సూర్యకాంత్ బెహెరా తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారంటూ 22 యేళ్ల యువతి పోలసర పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసింది.
దీంతో సూర్యకాంత్‌పై పోలీసులు గత 2024 నవంబరు నెలలో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతడు కొడాలా సబ్ జైలులో విచారణ ఖైదీగా ఉంటున్నాడు. అయితే, ఈ కేసును సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి.
ఈ నేపథ్యంలో నిందితుడు, బాధిత యువతి పెళ్లికి అంగీకరించారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆదివారం కొడాలా సబ్ జైలులో వారిద్దరికీ హిందూ సంప్రదాయం ప్రకారం అధికారులు పెళ్లి జరిపించారు. అయితే, తుది తీర్పు వెలువడే వరకు నిందితుడు సూర్యకాంత్ జైలులోనే ఉండనున్నాడు.