తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీశ్ ఆత్మహత్య కేసులో ఓ యువతిని పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్ హత్యకు ఈ యువతే ప్రధాన కారణమని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. హరీశ్ బలవన్మరణానికి ఆమె వేధింపులే కారణంగా భావించి, కొన్ని రోజులుగా ఆమె కోసం గాలిస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే చచ్చిపోవాలంటూ ఆమె చేసిన వేధింపులే ఎస్ఐ త్మహత్యకు కారణంగా పోలీసులు తేల్చారు.
ఆయన అందుకు నిరాకరించడంతో తనను శారీరకంగా ఉపయోగించుకుని, ఇప్పుడు పెళ్లికి తిరస్కరిస్తున్నావని ఉన్నతాధికారులకు, మీడియాకు చెబుతానంటూ బెదిరించింది. తనను పెళ్లి చేసుకోకుంటే చచ్చిపోవాలంటూ ఇబ్బందులకు గురిచేయడంతో మనస్తాపానికి గురైన హరీశ్ ఆత్మహత్య చేసుకున్నారు. అనూషను అరెస్టు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు.