నకిలీ డ్రగ్స్ వేధింపులు భరించలేక యువ నటి ఆత్మహత్య... ఎక్కడ?

సోమవారం, 27 డిశెంబరు 2021 (08:49 IST)
ఓ యువనటి బలవన్మరణానికి పాల్పడింది. డ్రగ్స్ కేసులో పేరు వెల్లడించకుండా ఉండాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ, పదేపదే వేధించడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఇలా వేధింపులకు పాల్పడింది నకిలీ అధికారులు కావడం గమనార్హం. ఈ దారుణం ముంబైలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 28 యేళ్ళ బాధిత నటి ఈ నెల 20వ తేదీన ఓ నక్షత్ర హోటల్‌లో పార్టీకి వెళ్లింది. అక్కడామెను కలిసిన ఇద్దరు వ్యక్తులు తాము నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి) అధికారులమని తమను తాము పరిచయం చేసుకున్నారు. అయితే, డ్రగ్స్ కేసులో పేరు బయటపెట్టకుండా ఉండాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. 
 
ఆ తర్వాత పదేపదే ఆమెకు ఫోన్ చేస్తూ వేధించసాగాడు, పైగా, డబ్బులు ఇవ్వకుంటే పేరు లీక్ చేస్తామంటూ బెదిరించారు. వారి వేధింపులను భరించలేని ఆమె గురువారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను వేధించిన మోహన్ పర్దేశి (38), ప్రవీణ్ కుమార్ వలింటే (35)అనే ఇద్దరిని అరెస్టు చేశారు. వీరివద్ద పోలీసులు జరిపిన విచారణలో వీరిద్దరూ నకిలీ ఎన్సీబీ అధికారులని తేలింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు