2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

ఐవీఆర్

మంగళవారం, 31 డిశెంబరు 2024 (22:30 IST)
ఎన్నాళ్లుగానో సాగుతున్న వాళ్ల స్పా సెంటర్ నేర సామ్రాజ్యానికి 2024 సంవత్సరం పోతూపోతూ పట్టించేసింది. ఒంగోలులో స్పా సెంటరుకి వచ్చిన పురుషులకు మర్దన చేస్తూ వారి నగ్న ఫోటోలను తీసి బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా లక్షలకు లక్షలు దండుకున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. తమకు ఎప్పటిలానే అలవాటైన విద్యను స్పా సెంటరుకు వచ్చిన ఓ విటుడి న్యూడ్ ఫోటోలు తీసి అతడిని తను సొంతంగా ఏర్పాటు చేసిన నకిలీ టీంతో రైడ్ చేయించాడు.
 
నిజంగానే తనను పోలీసులు పట్టుకున్నారన్న భయంతో సదరు వ్యక్తి వణికిపోయాడు. దీనితో శ్యామ్ అండ్ కో... అతడిని రూ. 3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు. తనవద్ద అంత డబ్బు లేదని బ్రతిమాలడంతో కనీసం రూ. 3 లక్షలైనా ఇవ్వాలని బెదిరించారు. లేదంటే... నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బ్లాక్ మెయిల్ చేసారు. దీనితో అతడు ఎలాగో వారి నుంచి బయటపడి పోలీసుల వద్ద ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్ నడుపుతున్న స్పాతో పాటు నకిలీ పోలీసు టీంను అరెస్ట్ చేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు