స్కూలుకు వెళ్లే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి కట్టేసి పెళ్లి చేసేసారు (video)

ఐవీఆర్

శనివారం, 14 డిశెంబరు 2024 (19:02 IST)
బీహారు రాష్ట్రంలో ఓ బలవంతపు పెళ్లి జరిగింది. ఉదయాన్నే పాఠశాలకు వెళుతున్న ఉపాధ్యాయుడిని తుపాకులతో బెదిరించిన కొందరు వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేసి ఓ గుడికి తీసుకెళ్లారు. అక్కడ పెళ్లికుమార్తె దుస్తుల్లో ముస్తాబై వున్న లఖిసరాయ్ అనే వధువుతో అతడికి పెళ్లి చేసారు. ఆ సమయంలో అతడి కాళ్లను కట్టేసారు. చేతులు రెండూ ఇద్దరు వ్యక్తులు పట్టుకుని బలవంతంగా పెళ్లి కానించేసారు. ఈ ఘటన బీహారు రాష్ట్రంలోని కితహార్ జిల్లాలో జరిగింది.
 

कथित आशिक बना बीपीएससी शिक्षक, प्रेमिका से शादी से किया इनकार, फिर क्या था, लड़की के घर वालों ने मास्टर को पकड़ा और करा दिया पकड़वा विवाह, बिहार के बेगूसराय से वीडियो वायरल#Bihar #Begusarai #पकड़वा_विवाह pic.twitter.com/cD64HtGhZR

— Khabar Seemanchal | ख़बर सीमांचल (@khabarsemanchal) December 14, 2024
కాగా ఉపాధ్యాయుడు అవినీష్ గత నాలుగేళ్లుగా లఖిసరాయ్ తో ప్రేమాయణం నడుపుతున్నట్లు పెళ్లి చేసినవారు చెబుతున్నారు. ఉద్యోగం రాకమునుపటి వరకూ ఆమెతో సరసాలు జరిపిన గుంజన్, టీచర్ పోస్ట్ రాగానే ముఖం చాటేసాడని ఆరోపిస్తున్నారు. ప్రేయసి లఖిసరాయ్ ఎన్నిమార్లు ప్రాధేయపడినా అతడు తప్పించుకుని తిరుగుతున్నాడనీ, అందువల్ల తామీ పని చేసినట్లు చెప్పారు. కాగా పెళ్లయిన తర్వాత వధువుతో సహా గుంజన్ తన ఇంటికి వెళ్లగా అతడి తల్లిదండ్రులు లఖిసరాయ్ ను ఇంట్లోకి అడుగుపెట్టనివ్వబోమని భీష్మించారు. దీనితో సదరు మహిళ వారి ఇంటి ముందే ఆందోళకు దిగింది. విషయం పోలీసు కేసు వరకూ వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు