మొక్కజొన్న పిండి - 1 టేబుల్ స్పూన్,
మిరియాల పొడి - 1 1/2 స్పూన్,
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్,
ముందుగా కోడి గుడ్లలో ఉప్పు వేసి బాగా గిల కొట్టండి. వెడల్పాటి బాణలిలో నీళ్లు పోసి చిన్న పాన్ మధ్యలో వుంచి బాగా గిల కొట్టిన గుడ్డుకు వుంచి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆపై పాన్ లోని ఉడికించిన కోడిగుడ్డును తీసి చల్లారనివ్వాలి. ఆపై ఉడికిన కోడిగుడ్లను వేరు చేసి కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. ముందుగా వెడల్పాటి బాణలిలో మైదా పిండి, మొక్కజొన్న పిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఉప్పు, పెరుగు వేసి బాగా కలపాలి. దీనికి తరిగిన కోడిగుడ్డు ముక్కలను వేసి బాగా కలిపి రెండు గంటలు నానబెట్టాలి. తర్వాత బాణలిలో నూనె పోసి అది వేడయ్యాక గుడ్డు ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి వేడి వేడిగా సాస్‌తో సర్వ్ చేయాలి.