కత్తెర, సుత్తుల్ని ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదట..!

FILE
సాధారణంగా కొందరు ఇంటికి ఉపయోగపడే ఉపకరణాలను బహుమతి ఇవ్వడం చేస్తుంటారు. ఈ క్రమంలో న్యూ డిజైన్‌లతో మార్కెట్లోకి వచ్చిన కత్తెర, స్క్రూడ్రైవర్లు, సుత్తుల్ని బహుమతి ఇచ్చేస్తుంటారు. కానీ కత్తెర, స్క్రూడ్రైవర్లు, సుత్తి లాంటి వాటిని ఇతరులకు ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

అలాగే మీరు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కత్తెరని ఎవరికేసి సూచించకండి. అది చెడు శక్తిని సృష్టిస్తుంది. కేవలం కత్తెరలే కాకుండా, స్క్రూడ్రైవర్లు, సుత్తి లాంటి వస్తువులు సైతం మీ ఆఫీసు బల్లమీదగాని, హాల్లోగాని ఉండకుండా చూసుకోవడం మంచిది. ఎందుకంటే అవి విషపు బాణాలను వెదజల్లుతాయి.

ఇకపోతే చాలా మంచి ఫలానా వ్యక్తిని పరిచయం చేసేటప్పుడో లేదా సూచించేటప్పుడు తమ చూపుడు వ్రేళ్ళతో ఆ వ్యక్తిని పరిచయం చేస్తారు. నిజానికిది చెడ్డ అలవాటే కాకుండా చెడు చీ శక్తిని సైతం పెంపొందింపజేస్తుంది. పైగా అది చూపుడు వేలు సూచించిన వ్యక్తి దురదృష్టాన్ని సైతం చూపిస్తుంది. అందుచేత ఎదుటివారు అలా మీ వైపు చూపుడు వ్రేలుతో చూపిస్తే.. మీరు ప్రక్కకి జరగండి. లేదా అలా చేయవద్దని ఆ వ్యక్తికి సూచించండని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి