కొత్తగా బిజినెస్ ప్రారంభిస్తున్నారా?

మీరు కొత్తగా బిజినెస్ ప్రారంభిస్తున్నారా? లేదా పాత ఆఫీసును వేరొక ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? ఫెంగ్‌షుయ్ సూత్రాలను అనుసరించండి. సాధారణంగా బిజినెస్‌లో పురోభివృద్ధిని సాధించడం వైపే అందరూ మొగ్గుచూపుతుంటారు. అయితే వ్యాపారంలో నష్టం వాటిల్లకూడదని అందరూ భావిస్తుండటం సహజం. ఇలాంటి వారు ఫెంగ్‌షుయ్ సూత్రాలను ఆచరిస్తే... వ్యాపారంలో పురోభివృద్ధిని సాధించడం సులభమని ఫెంగ్‌షుయ్ శాస్త్రజ్ఞులు అంటున్నారు.

ఇక ఫెంగ్‌షుయ్ చెబుతున్న కొన్ని సూత్రాలను పరిశీలిస్తే... డ్రాగన్, తాబేలు కలిసి ఉండి వాటి రెండింటిపైన ఒక శిశువు కూర్చొని ఉన్న బొమ్మను, ఈశాన్యం, ఉత్తర దిశల మధ్యగా పెట్టుకోవాలని ఫెంగ్‌షుయ్ అంటోంది. అదేవిధంగా హాలులోగాని, ఎం.డి. ప్రత్యేక గదిలోనూ ఈ బొమ్మను పెట్టుకోవడం ద్వారా లాభాలు చేకూరుతాయి. ఈ బొమ్మ ముఖం ద్వారం నుండి లోపలివైపు మనకు దగ్గరగా వస్తున్నట్లు ఉంచాలి.

ఇలా బొమ్మను అమర్చడం ద్వారా... డ్రాగన్ మనవైపు చూస్తూ... మన వెనుక జరిగే కుట్రల నుంచి కాపాడుతుందని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. అలాగే కొత్త వ్యవహారాల్లో దూసుకుపోయే శక్తినిస్తుంది. తాబేలు బొమ్మను అమర్చడం ద్వారా మొదలు పెట్టిన పనుల్లో స్థిరత్వాన్నిస్తుంది. ఎలాంటి ప్రతికూల శక్తులనైనా ఎదుర్కోగల ధైర్యాన్నిస్తుందని ఫెంగ్‌షుయ్ శాస్త్రం అంటోంది.

వెబ్దునియా పై చదవండి