దంపతులిద్దరూ ఒకే పరుపు మీద శయనిస్తున్నారా?

వివాహ బంధంతో ఒకటైన దంపతులిద్దరూ ఒకే పరుపు మీదే శయనించాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఎక్కువ మంది దంపతులు ఒకే డబుల్‌కాట్ మంచం మీద రెండు పరుపులు వేసుకుని శయనిస్తారు.

అయితే రెండు పరుపుల మీద దంపతులు శయనించడం మంచిది కాదని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది. అలా రెండు పరుపుల మీద పడుకున్న దంపతుల మధ్య విభేదాలు, కాలానుగుణంగా విడిపోయే అవకాశాలున్నాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

ఒకే డబుల్ కాట్ మంచం మీద రెండు పరుపులు వేసుకుని శయనించడం కంటే.. చెరో బెడ్‌రూమ్‌లో పడుకోవడం మంచిదని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. అంతేగాని ఒకే మంచానికి రెండు ప్రత్యేక పరుపులు వేసుకోకూడదు. అదేవిధంగా ఒకే బెడ్‌రూమ్‌లో రెండు మంచాలు ఉండకూడదు.

అదేవిధంగా..మీ మంచానికెదురుగా టాయ్‌లెట్‌గాని, అద్దాలు గాని, ఎలక్ట్రానిక్ వస్తువులు గానీ లేకుండా తగిన చర్యలు తీసుకోవడం శ్రేయస్కరమని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు. ఒకే మంచం-రెండు పరుపులు అశుభానికి నిదర్శనమని వారు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి