బెడ్‌రూమ్‌లో తెలుపు బెడ్ షీట్‌లను వాడకూడదట!

FILE
మీరు కొత్తగా పెళ్లైన దంపతులా? మీ బెడ్‌రూమ్‌లో ఆనందకరమైన వాతావరణం నెలకొనాలని భావిస్తున్నారా? అయితే ఫెంగ్‌షుయ్ పేర్కొన్న కొన్ని సూచనలు పాటిస్తే సరిపోతుంది. ముఖ్యంగా పెళ్లైన మొదటి రోజుల్లో బెడ్‌రూమ్‌ని ఎరుపురంగులతో అలంకరించండని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకంటే ఎరుపు డైనమిజానికి చిహ్నం. అలాగే పెళ్లైన కొత్త దంపతులు వాడే బెడ్‌రూమ్‌లో తెల్లని బెడ్‌షీట్‌లకు వాడకూడదు. బెడ్‌రూమ్‌లో ఎప్పుడూ మొక్కలను, పువ్వులను ఉంచకూడదు. అలాగే మీ పడకగదిలో ఎప్పుడూ నీళ్లకి సంబంధించిన వాటిని తొలగించడం మంచిది.

ఉదాహరణకు అక్వేరియం, ఫౌంటెన్‌లాంటివి అక్కడ నుంచి తీసెయ్యాలి. ఎందుకంటే అవి దంపతుల మధ్య తగాదాలకు, నిద్రలేమి రాత్రులకు దారితీస్తాయి. ఇంకా మీ బెడ్‌రూమ్‌లో పెళ్లైన దంపతులున్న పెయింటింగ్‌లను తగిలిస్తే దాంపత్యం వెయ్యేళ్ళు వర్థిల్లుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి