బెడ్‌రూమ్‌లో దంపతుల ఫోటోలను పెట్టండి

WD
మీ బెడ్‌రూమ్‌లో ఎప్పుడూ, మొక్కలను, పువ్వులను ఉంచకండని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. ఎట్టిపరిస్థితిలోనూ మొక్కలను పడకగదిలో ఉంచడం మంచిది కాదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

పెళ్లైన కొద్దిరోజుల్లోనే మీ బెడ్‌రూమ్‌ని ఎరుపురంగులతో అలంకరించుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని ఫెంగ్‌షుయ్ చెబుతోంది.

అలాగే పడకగదిలో పెళ్ళైన దంపతుల పెయింటింగ్‌లను లేదా ఫోటోలను తగిలిస్తే దాంపత్యం వెయ్యేళ్లు వర్ధిల్లుతుంది. ఎప్పుడూ నీళ్ళకి సంబంధించిన అంటే.. అక్వేరియం, ఫౌంటెన్‌లను తీసేయండి.

నీటికి సంబంధించిన వస్తువులు బెడ్‌రూమ్‌లో ఉంటే, అవి దంపతుల మధ్య తగాదాలకు, నిద్రలేమి తనానికి దారితీస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి