మీ గృహంలో శ్రీకృష్ణార్జునుల పటం ఎలా ఉంది?

చాలామంది గృహాల్లో కృష్ణార్జునుల పటాలుంటాయి. తమ తమ రంగాల్లో ప్రత్యేక అభివృద్ధి, విజయ సాధన కోసం శ్రీకృష్ణార్జున పటాన్ని చాలామంది గృహాల్లోనో లేదా ఆఫీసుల్లోనూ ఉంచుతారు. అయితే కృష్ణార్జునులు కలిసి ఉండే ఫోటోల్లో కొన్ని ఫెంగ్‌షుయ్ నిషేధిత దృశ్యాలు లేని పటాలను మాత్రమే ఇళ్లల్లోనూ, కార్యాలయాల్లోనూ ఉంచాలని ఆ శాస్త్ర నిపుణులు అంటున్నారు.

అవేంటంటే... సాధారణంగా పాండవ-కౌరవ యుద్ధం జరగబోయే ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసే దృశ్యం గల చిత్రపటాన్ని ఫెంగ్‌షుయ్ ప్రకారం ఉంచకూడదు. మరి... గీతోపదేశ పటాలు లేదా పెయింటింగ్‌లను తీసెయ్యాల్సిందేనా అని చాలా మందికి సందేహం రావచ్చు.

ఇందులో ముఖ్యంగా... కేవలం భయానక దృశ్యాలైన యుద్ధం, జిగుప్స, భీభత్సం వంటి దృశ్యాలుండే శ్రీకృష్ణార్జునుల పటాన్ని తప్పకుండా తీసేయడం మంచిది. అదేవిధంగా.. గీతోపదేశం పటంలో అవతల భటులు, గుర్రాలు, బాణాలు, ఉండగా రధం మీదే శ్రీ కృష్ణార్జునులున్న పటాలను కూడా తీసేయడం శుభప్రదం.

అయితే భటులు, బాణాలు, గుర్రాలు వంటివి లేకుండా కేవలం శ్రీకృష్ణార్జునులు మాత్రమే ఉన్న పటాన్ని గృహంలో గానీ, ఆఫీసులోగానీ ఉంచితే సకల సంపదలు, అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి