ఫెంగ్‌షుయ్ ప్రకారం "ఫోనిక్స్" చిత్రం అమరిక

బుధవారం, 24 సెప్టెంబరు 2008 (15:10 IST)
అవకాశాలు వెల్లువల్లా రావాలంటే ఫెంగ్‌షుయ్ ప్రకారం ఫోనిక్స్ చిత్రాన్ని మీ హాల్లో దక్షిణం వైపు తగిలించాలని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. ఈ ఫోనిక్స్ చిత్రాన్ని హాలులో తగిలించడం ద్వారా బిజినెస్‌లో నష్టాన్ని చవిచూసిన వారికి, ఉన్నత చదువుల కోసం సీట్ మిస్సయి దాని కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు వెల్లువల్లా వస్తాయని ఫెంగ్‌షుయ్ శాస్త్రజ్ఞులు అంటున్నారు.

అలాగే... మీ అమ్మాయికి గానీ, అబ్బాయి గానీ సంబంధం కుదరని పక్షంలో, లేదా సంబంధం వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాకుండా ఉంటే ఆ గృహంలో ఫోనిక్స్ చిత్రాన్ని తగిలించాలి. ఇలా చేస్తే ఆ గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. గోడలపై తగిలించడమే కాకుండా ఫోనిక్స్ పక్షి డిజైన్‌లో వచ్చే దుస్తులను కూడా ధరించడం ద్వారా మంచి ఫలితాలు దరి చేరుతాయని వాస్తు చెబుతోంది.

ఇకపోతే... ప్రతి ఒక్కరు తమ తమ రంగాల్లో నెంబర్ వన్ కావాలని ఆశిస్తుంటారు. నెంబర్ వన్ అయ్యేందుకు అందరూ కృషి చేస్తుంటారు. ఇలాంటి వారు మీరైతే... మీ ఆఫీసు డెస్క్ కుడిచేతివైపు డ్రాగన్ బొమ్మని ఉంచండి. ఈ డ్రాగన్ బొమ్మ ఎప్పుడు ప్రథమ ద్వారం ఎదురుగా గానీ, కిటికీవైపునకు చూస్తున్నట్లు ఉండాలని వాస్తు నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి