అతిథులను ఆకట్టుకునే రీతిలో అప్పుడప్పుడు మనం గృహాలంకరణ చేస్తూ ఉంటాం. ప్రతిగదిని కాంతివంతంతో వివిధ రకాలైన ఫోటోలతో తీర్చిదిద్దుతూ ఉంటాం. అలాంటి అలంకరణలో ఆక్వేరియం ఏర్పాటు కీలక పాత్ర పోషిస్తోంది.
ఆక్వేరియాలను రంగు రంగుల చేపలతోగానీ, సీనరీలతో డెకరేట్ చేస్తాం. ఇలా అందంగా రూపొందించిన ఆక్వేరియాలను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.
ఒక్క పడకగదిని తప్పనించి ఏ ప్రాంతంలోనైనా ఆక్వేరియాలను ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఈ ఆక్వేరియంను ఉత్తరంవైపు మాత్రమే ఉంచాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు. అలాగే మీరు తాగుతున్న టీ కప్పు లేదా కాఫీ కప్పు ఈ ప్రదేశంలో డెస్క్‌వేసి దానిపై ఉంచండి. ఇంకా ఈ దిశలో ద్రవపదార్థంతో కదలాడే ఆటవస్తువునుగానీ, ఆక్వేరియంను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇకపోతే.. మీ ఇంట్లో ఈశాన్యం దిశలో పేపర్ వెయిట్ లాంటి గాజు, సిరమిక్ లేదా క్రిస్టల్‌లకు సంబంధించిన వస్తువులను ఉంచండి. అలాంటివి పెడితే సకలసంపదలతో పాటు సత్ఫలితాలు చేకూరుతాయని ఫెంగ్‌షుయ్ శాస్త్రం చెబుతోంది.
తూర్పుదిశలో.. తాజా పువ్వులతో ఫ్లవర్ వాజ్‌లను పెట్టండి. లేకపోతే టేబుల్ క్లాత్‌పై ఒక అద్దంలాంటింది పెట్టి దాని కిందుగా పువ్వులుండే చిన్న పటం పెట్టండి.
అలాగే ఆగ్నేయంలో.. ఆకుపచ్చగా గల సీనరీలు గల పటాన్ని పెట్టడం ద్వారా అభివృద్ధి కలుగుతుంది.
దక్షిణంలో మాత్రం కంప్యూటర్ లేదా ఇతర వెలుగులను విరజిమ్మే వస్తువులను పెట్టడం ద్వారా అదృష్టం కలిసి వస్తుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.