మీరు ధనవంతులు కావాలంటే..?

ఇంటిని శుభ్రంగా ఉంచితే లక్ష్మీకటాక్షంతో సంపద వెల్లువల్లా వస్తుందని పెద్దలంటూ ఉంటారు. అదేవిధంగా గృహాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచండం ద్వారా ధనవంతులవుతారని ఫెంగ్‌షుయ్ శాస్త్రం కూడా చెబుతోంది.

ఈ క్రమంలో మీ ప్రథమ ద్వారపు గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ప్రథమ ద్వారపు నేలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అక్కడ చెత్తా చెదారం, పనికిరాని వస్తువులను తొలగించడం మంచిది.

అదేవిధంగా ఆగ్నేయం మూల సంపదకు చిహ్నం. అక్కడ డబ్బుని లేదా అకౌంట్ పుస్తకాన్ని, బంగారం, నగదు దాచిపెట్టే పెట్టెలను ఉంచడం మంచిది. దీనిద్వారా ఇంటికి సంపద వెల్లువలా వస్తుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

ఇకపోతే.. మీ డైనింగ్ రూమ్ మంచి సంపదకి చిహ్నం. అందుచేత డైనింగ్ రూమ్ ద్వారం నుండి ప్రథమ ద్వారం వైపు మీ సంపద, డబ్బు తరలివెళ్ళకుండా మీ డైనింగ్ గదికి తెరకట్టండి.

అయితే.. మీ టాయ్‌లెట్ తలుపులను ఎప్పుడూ మూసి ఉంచడం మంచిదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి