బతుకమ్మ పండగ వెనక మన చారిత్రక నేపథ్యం కూడా ప్రచారంలో ఉంది. ప్రాచీన కాలంలో చాళుక్యులు వేములవాడను రాజధానిగా ఉపయోగించేవారు. అయితే చాళుక్యులను జయించిన చోళులు తమ ఆరాధ్య దైవమైన బృహదీశ్వరుణ్ని తంజావూరుకు తరలించుకుపోయి బృహదీశ్వరీ దేవి వియోగ దుఃఖానికి కారణమయ్యారు.