ఏలినాటి శని జరుగుతుందా..? నీలాన్ని ధరించండి

నీలం : నవగ్రహాలలో శనికి నీలం వర్తిస్తుంది. మకర, కుంభ రాశులలో పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో, 8, 17, 26 తేదీలలో పుట్టిన వారు.. అదే విధంగా, డిసెంబర్ 22, జనవరి 20 మధ్య సాయన మకర రాశిలో, మకర లగ్నంలో పుట్టినవారు గానీ ఈ నీలపు రత్నాన్ని ధరించవచ్చు.

శని దశగాని, ఏలినాటి శనిగానీ జరుగుతున్నవారు పండితులను సంప్రదించి ఎలాంటి దోషాలు లేని జాతి నీలాన్ని ధరించవచ్చు. దోషం గల నీలాలు చెడు ఫలితాలను ఇస్తాయి. ఎడమచేతి నడిమి వేలికి నీలాన్ని ధరించాలి. నీలరత్నధారణకు శనివారం, శ్రవణా నక్షత్రం అనుకూలం. నీలాన్ని ధరించడంతో కష్టనష్టాలు సమసిపోయి మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని, సంపదను కలిగిస్తుంది. పక్షవాతం, పైత్య దోషం, కీళ్ళ నొప్పులు, దృష్టి దోషం మొదలైన వాటిని నీలరత్నధారణ తొలగిస్తుంది.

పచ్చ: బుధుని రత్నం పచ్చ. మిధున, కన్యా రాశులు లగ్నాలు, అశ్లేష, జ్యేష్ట, రేవతి నక్షత్రాలు 5, 14, 23 తేదీలు, మే 21 నుండి జూన్ 21 మధ్యలో జన్మించినవారు, ఆగస్టు 24 సెప్టెంబరు 23 మధ్యలో పుట్టినవారు జాతి పచ్చ ధరించవచ్చు. విద్యకు, విజ్ఞానానికి, వ్యాపారానికి, వైద్య వృత్తికి, జ్ఞాపక శక్తికి, విష నివారణ, మానసిక రోగ నివృత్తికి ఇది తోడ్పడుతుంది.

జీర్ణకోశానికి, నరాలు, మెదడుకు సంబంధించిన జబ్బులు, హిస్టీరియా, మతి భ్రమణం, పచ్చకామెర్లు, కడుపునొప్పి, రక్తపుపోటు మొదలైనవి తొలగించి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని స్నేహ సామరస్యాలను పెంపొందిస్తుంది.

గోమేధికం : గోమేధికం రాహువుకు సంబంధించిన రత్నం. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు 4, 13, 22, 31 తేదీలు, జనవరి 21 నుండి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన సాయన కుంభరాశి జాతకులు గోమేధికం ధరించవచ్చు. ఇది గోమూత్రం రంగులో ఉంటుంది. తేనె రంగువి కూడా మంచివే. శత్రు, రుణ, రోగ, గ్రహ, పిశాచ వేదనలు, కష్టనష్టాలను తొలగిస్తుంది.

వెబ్దునియా పై చదవండి