పుష్యమి రెండోపాదం : జన్మకారుల రత్నధారణ...!

మంగళవారం, 30 సెప్టెంబరు 2008 (20:06 IST)
పుష్యమి నక్షత్రం రెండోపాదంలో జన్మించిన వారికి 14 సంవత్సరాల వయస్సు వరకు శనిమహర్దశ సంచరిస్తుండడంతో... నీలమును వెండిలో పొదిగించుకుని మధ్య వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభప్రదమని రత్నాల శాస్త్రం చెబుతోంది.

14 ఏళ్ళ నుంచి 31 సంవత్సరాల వరకు బుధమహర్దశ కావడంతో...పచ్చను బంగారంలో పొదిగించుకుని చిటికెన వ్రేలుకు ధరించుకున్నట్లైతే అనుకున్న కార్యాలు సత్వరమే సిద్ధిస్తాయని రత్నశాస్త్రనిపుణులు వెల్లడిస్తున్నారు.

31 సంవత్సరాల నుండి 38 సంవత్సరాల వరకు కేతుమహర్దశ కావడంతో... వైఢూర్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభపరిణామాలు చోటుచేసుకుంటాయని వారు అంటున్నారు.

38 ఏళ్ళ వయస్సు నుంచి 58 సంవత్సరాల వయస్సు వరకు శుక్రమహర్దశ సంచరిస్తుండటంతో వజ్రమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని రత్నశాస్త్రకారులు తెలుపుతున్నారు.

58 సంవత్సరాల వయస్సు నుంచి 64 ఏళ్ళ వయస్సు వరకు రవి మహర్దశ ప్రవేశిస్తుండటంతో కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే శుభఫలితాలు కలుగుతాయని రత్నశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

64 సంవత్సరాల వయస్సు నుంచి 74 సంవత్సరాల వరకు చంద్రమహర్దశ సంచారం కారణంగా ముత్యమును వెండిలో పొదిగి ఉంగరపువ్రేలుకు ధరించవచ్చునని రత్నాల శాస్త్రం పేర్కొంటోంది.

74 ఏళ్ళ నుంచి 81 సంవత్సరాల వయస్సు వరకు కుజమహర్దశ సంచరిస్తుండడంతో... పగడమును బంగారంలో పొదిగించుకుని ఉంగరపు వ్రేలుకు ధరించుకున్నట్లైతే సత్ఫలితాలనిస్తాయని వారు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి