ఇవి మీకు తెలుసా..?!

బుధవారం, 5 నవంబరు 2008 (11:19 IST)
ఐస్‌లాండ్ దేశంలో హోటల్ వెయిటర్లు టిప్ తీసుకోవడాన్ని అవమానంగా భావిస్తారట. భలే బాగుంది కదూ..!

వెనిజులాకు చెందిన ఒక జాతి గబ్బిలం హోరున వర్షం పడుతున్నపుడు కూడా ప్రతీ చినుకునూ తప్పించుకుంటూ తన గూటికి తడవకుండా చేరగలుగుతుందట.

న్యూజిలాండ్‌లోని "కీ" అనే పక్షి కారు కిటికీల చుట్టూ అమర్చే రబ్బరును తినేందుకు అమితంగా ఇష్టపడుతుందట.

ఒక వయోలిన్ తయారు చేయడానికి 70 వేర్వేరు కలప ముక్కల్ని ఉపయోగిస్తారు.

ప్రపంచంలో ఎక్కువమందికి ఉన్న మొదటి పేరు మహమ్మద్.

వెబ్దునియా పై చదవండి