మీకివి తెలుసా...?!

మంగళవారం, 4 నవంబరు 2008 (12:17 IST)
మహాత్మాగాంధీ చనిపోయినప్పుడు శవ పంచనామాలో ఆయన చిన్న పేగుల్లో దక్షిణాఫ్రికాకు చెందిన ఐదు బంగారు నాణాలు బయటపడ్డట్లు వార్తలు వెలువడ్డాయట..!

ప్రాచీన గ్రీస్ నగరంలో సంపన్న కుటుంబాల వారు తమ పిల్లల వంటిపై రోమాలు పెరగకుండా ఉండేందుకు పుట్టగానే ఆలివ్ నూనెలో ముంచేవారట..!

అమెరికన్ సైనికులు ఆప్ఘనిస్థాన్‌లో ఒసామా బిన్ లాడెన్ స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అతని గదిలో "మాడ్" అనే పత్రిక ప్రతులు ఇరవయ్యేడు లభ్యమయ్యాయట..! మాడ్ అంటే... అమెరికాకు చెందిన "కామిక్ బుక్ మ్యాగజైన్".

ఎనిమిదో హెన్రీ చక్రవర్తి నిద్రపోయేటప్పుడు నిత్యం తన పడకపై ఒక పెద్ద గొడ్డలి ఉంచుకునేవాడట.

ప్రపంచవ్యాప్తంగా రోజుకు ఇరవై బ్యాంకులు దోపిడీకి గురవుతున్నాయట.

వెబ్దునియా పై చదవండి