ఇవి మీకు తెలుసా..?!

మంగళవారం, 25 నవంబరు 2008 (15:47 IST)
* మానవుడి పొట్టలో మూడున్నర కోట్ల జీర్ణగ్రంథులు ఉంటాయి. మనం తినే తిండిని జీర్ణం చేసేందుకు... పాపం అవన్నీ మూడు పూటలా పని చేస్తాయట.

* అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఒకప్పుడు సిక్స్ (6) పేరుతో ఒక పట్టణం ఉండేదట.

* దక్షిణ అమెరికాలోని పెరుగ్వే, తూర్పు యూరప్‌లోని మాల్దోవా దేశాల జాతీయ జెండాలు రెండువైపులా వేర్వేరు చిహ్నాలను కలిగి ఉంటాయి. ప్రపంచంలో ఏ దేశ జాతీయ జెండా కూడా ఈ విధంగా లేదు.

* ఎవరెస్టును అధిరోహించాలని చాలామంది ఉబలాటపడుతుంటారు కదా.. ఆ సాహసం చేస్తున్న ప్రతి పదిమందిలో ఒకరు మార్గమధ్యంలోనే దుర్మరణాల పాలవుతున్నారట.