పిల్లలూ... సాఫ్ట్‌వేర్ ఎంటర్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ అయిన "ఒరాకిల్" గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒరాకిల్ అనేది ఓ అమెరికన్ కంపెనీ. దీన్ని 1977వ సంవత్సరంలో లారీ ఎలిసన్, తన మిత్రుడు బాబ్ ఓట్స్‌తో కలిసి కాలిఫోర్నియాలో స్థాపించాడు.
సాఫ్ట్‌వేర్ ఎంటర్ ఎంటర్‌ప్రైజెస్ మార్కెటింగ్ విభాగంలో ఒరాకిల్ సంస్థ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఇందులో మొత్తం 84,233 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇకపోతే... ఈ కంపెనీకి ఒరాకిల్ అనే పేరు ఎలా వచ్చిందంటే...
లారీ ఎలిసన్, బాబ్ ఓట్స్ ఇద్దరూ అమెరికన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సిఐఐ)లో ఒక ప్రాజెక్టు కోసం పనిచేస్తుండేవారు. సైన్యం కోసం తయారు చేస్తున్న ఆ ప్రాజెక్టు పేరు "ఒరాకిల్". అయితే ఆ ప్రాజెక్టు అంతగా పాపులర్ కాలేదట. ఎందుకంటే ఒరాకిల్ కంటే వేగంగా పనిచేసే చాలా ప్రాజెక్టులు రావడంతో అది వెలుగులోకి రాకుండా పోయింది.
అయితే సిఐఐలో పేరు రాకపోతేనేం.. మనమే తెచ్చుకుందామని భావించిన లారీ ఎలిసన్, బాబ్ ఓట్స్‌లు పెట్టిన సొంత కంపెనీకే "ఒరాకిల్" అనే పేరు పెట్టుకున్నారు. ఇది ఆ పేరుతో పూర్తిగా విజయవంతం కావడం, ఒరాకిల్ పేరు ప్రపంచమంతా మార్మోగడం లాంటి విషయాలతో కూడిన తరువాతి కథ అంతా మనకు తెలిసిందే...!