reasons for frequent cold and sneezing: కొందరికి తరచూ జలుబు చేస్తుంటుంది. జలుబు(Cold) చేయడానికి 7 సాధారణ కారణాలున్నాయని అంటున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము.
బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ జలుబు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది దీర్ఘకాలిక అనారోగ్యం, ఇతర ఆరోగ్య పరిస్థితుల వల్ల కావచ్చు
ఇంటి లోపల, ఒకరికొకరు దగ్గరగా ఉన్నప్పుడు శీతాకాలంలో(Winter) జలుబు చాలా సాధారణంగా వస్తుంటుంది.
అనారోగ్యంతో ఉన్న వారి చుట్టూ పాఠశాలలో, పనిలో లేదా ప్రజా రవాణాలో వంటి బహిరంగ ప్రదేశాల్లో ఉండటం వలన జలుబు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
పొగతాగడం వల్ల జలుబుతో పోరాడే రోగనిరోధక వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని బలహీనపడటంతో జలుబు వస్తుంది.
పర్యావరణ కాలుష్య కారకాలు, ఎలర్జీలు కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపి జలుబుకి కారణం కావచ్చు.
విటమిన్ డి (Vitamin D) తక్కువ స్థాయిలు వున్నవారిలో జలుబు వచ్చే అవకాశాలుంటాయి.
కొందరిలో ఒత్తిడి, సైనటైసిస్ వంటివి కూడా జలుబు చేసేందుకు కారణమవుతాయి.