Udhampur Encounter: ఉధంపూర్‌లో ఉగ్రవాదులు- ఆ నలుగురిపై కాల్పులు- జవాను మృతి

సెల్వి

శనివారం, 20 సెప్టెంబరు 2025 (12:14 IST)
Udhampur Encounter
జమ్మూకాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉధంపూర్‌లోని దుడు బసంత్‌గఢ్ పర్వత ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా అక్కడ ముగ్గురు లేదా నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించారు. వీరు జైషే మహమ్మద్ ముఠాకి చెందిన వారని సమాచారం. వీరిని భద్రతా బలగాలు చుట్టిముట్టినట్లు తెలుస్తోంది. 
 
కాల్పుల సమయంలో ఓ ఆర్మీ జవాను మృతి చెందారు. బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. భద్రతా బలగాలు వెంటనే స్పందించి ఉగ్రవాదులను దిగ్బంధించాయి. 
 
ఈ ఆపరేషన్‌లో చిక్కుకున్న ఉగ్రవాదులు నిషేధిత జైషే మహ్మద్ (జేఈఎం) సంస్థకు చెందినవారై ఉంటారని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎన్‌కౌంటర్ జరుగుతున్న విషయాన్ని జమ్మూ ఐజీపీ కూడా ధ్రువీకరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు