రక్తపోటు చాలా ఎక్కువగా ఉంటే, వాటితో సహా కొన్ని లక్షణాలు కనబడవచ్చు. అలాంటి లక్షణాలు కనబడినప్పుడు ఎంతమాత్రం అశ్రద్ధ చేయకూడదు. ఆ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాము. తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ముక్కు నుంచి రక్తం కారడం కనబడవచ్చు.
అలసట లేదా గందరగోళంగా వుంటుంది. దృష్టి సమస్యలు తలెత్తుతాయి. ఛాతిలో నొప్పిగా వుంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. క్రమంగా లేనటువంటి హృదయ స్పందనను గమనించవచ్చు.
మూత్రంలో రక్తం పడటం కూడా కనబడవచ్చు. గమనిక: ఇలాంటి లక్షణాలు కనబడితే వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించాలి.