ఇప్పుడు మనం చూస్తున్న అత్యధిక కేసులు ముక్కు, కన్ను, మెదడుకు సంబంధించినవి(ROCM).
కాబట్టి దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
ఈ మ్యూకోర్మైకోసిస్‌ని ఎప్పుడు, ఎలా అనుమానించాలి?
ముక్కు దిబ్బడ వేయడం, ముక్కులోనుంచి నలుపు/ గోధుమ రంగు స్రావాలు రావడం, చెక్కిళ్ళ దగ్గర నొప్పి, తల నొప్పి, కంటి నొప్పి, కళ్ళు వాయడం, చూపు మందగించడం వంటివి ఉంటే దీనిని అనుమానించాలి.
ముకోర్మైకోసిస్‌ని ఎలా నిర్ధారణ చేస్తారు?
పైన చెప్పిన అనుమానిత లక్షణాలు ఉన్న వెంటనే అత్యవసరంగా మీ దగ్గరలోని చెవి, ముక్కు, గొంతు వైద్యున్ని సంప్రదించాలి. దీని నిర్ధారణ కోసం CT/MRI-PNS పరీక్ష చేస్తారు. ఊపిరితిత్తులలో కూడా ఉందో లేదో తెలుసుకోవడానికి CT Chest చేస్తారు.
వైద్య చికిత్స:
వ్యాధి తీవ్రతను బట్టి మొదట 1-6 వారాల పాటు Liposomal Amphotericin Bతో చికిత్స చేస్తారు. తరువాత మరో 3-6నెలలపాటు Posaconazole మాత్రలు వాడవలసి ఉంటుంది. వ్యాధి మరీ తీవ్రంగా ఉంటే శస్త్ర చికిత్స ద్వారా ఫంగస్ సోకిన ప్రాంతాన్ని శుభ్రపరచడం, కళ్ళె తీసివేయడం వంటివి చేస్తారు.