గాలి కాలుష్యంతో మెదడుకు దెబ్బేనని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా గాలి కాలుష్యంతో మెదడుకు సంబంధిత వ్యాధులు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలుకలపై నిర్వహించిన టెస్టుల్లో కలుషితమైన గాలిని పీల్చడంలో శారీరకంగా కొన్ని మార్పులు చోటు చేసుకోవడంతో పాటు, మెదడు సంబంధించి నెగటివ్ ఫలితాలు వచ్చాయని ఓహియో స్టేట్ యూనివర్శిటీ స్టడీలో తేలింది.
గాలి కాలుష్యంతో గుండె, ఊపిరితిత్తులకు ప్రమాదమని ఇంతకుముందు నిర్వహించిన సర్వేలో తేలగా, మొట్టమొదటి సారిగా గాలి కాలుష్యంతో మెదడుకు సంబంధిత వ్యాధులు సోకుతాయని తేలిందని ఓహియో స్టేట్ యూనివర్శిటీ స్టూడెంట్ లారా ఫాకెన్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో బసచేసే వారికే గాలి కాలుష్యంతో ప్రమాదం ఎక్కువని ఫాకెన్ చెప్పారు.