కొబ్బరి నీరు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు...

శుక్రవారం, 19 అక్టోబరు 2018 (14:37 IST)
కొబ్బరి నీరు తరచుగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే కొబ్బరి నీళ్లలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. దాంతో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. అలసటను, ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మంలోని మృతుకణాలను తొలగిస్తుంది.
 
శరీరంలో ప్రోటీన్స్ లోపం వలన ఆరోగ్యం మందగిస్తుంది. అందువలన ప్రతిరోజూ క్రమం తప్పకుండా కొబ్బరి నీరు తీసుకుంటే గుండె సంబంధితి వ్యాధులు దూరమవుతాయి. ముఖంపై మెుటిమలు, నల్లటి మచ్చలు గలవారు కొబ్బరిగుజ్జును చర్మానికి మంచి ఉపశమనం లభిస్తుంది.  
 
కొబ్బరి నీటిలో 95 శాతం నీళ్లు, 2.8 శాతం చక్కెర, 0.5 శాతం వరకు లవణాలు ఉంటాయి. కనుక కొబ్బరి నీటిలో కొద్దిగా పసుపు, గంధం కలుపుకుని ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు