బెల్లం తెగ వాడుతున్నారా? రంగు చూసి కొంటున్నారా? ఆస్తమా తప్పదట..

శనివారం, 24 డిశెంబరు 2016 (15:29 IST)
బెల్లం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని విని వుంటాం. ఇందులో ఐరన్, గ్లూకోస్, సుక్రోజ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బెల్లాన్ని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతామని వారు సూచిస్తున్నారు. కానీ బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగించే వారికి ఓ బ్యాడ్ న్యూస్. 
 
బెల్లం తయారీలో హానికార‌క ర‌సాయ‌నాలు వాడుతున్న‌ట్టు పరిశోధనలో తేలింది. రైతులు బెల్లం తయారు చేసే స‌మ‌యంలో హైడ్రాన్‌(స‌ల్ఫ‌ర్‌), సోడియం కార్బొనేట్‌, సూప‌ర్ ఫాస్ఫేట్ విచ్చ‌ల‌విడిగా ఉపయోగిస్తున్నట్లు అనకాపల్లికి చెందిన ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. సాధారణంగా నేల రంగులా ఉండే బెల్లానికి.. ఆకర్షణీయమైన రంగు జతచేయాలనే ఉద్దేశంతో రసాయనాలు తెగ వాడేస్తున్నారు. 
 
ఈ విషయాన్ని రైతులు కూడా అంగీకరిస్తున్నారు. రసాయనాలు కలిపిన బెల్లాన్ని వాడటం ద్వారా నాడీ వ్యవస్థకు దెబ్బ తప్పదు. ఆస్త‌మా, జీర్ణ  సంబంధ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ఇంకేముంది? ఇక బెల్లం రంగు చూసి కొనడం మానేయడం బెటర్. 

వెబ్దునియా పై చదవండి