ఒక పాత్రలో లీటరు మంచినీటిని తీసుకుని అందులో గుప్పెడు బార్లీ గింజలను వేయాలి. 20 నిమిషాలపాటు ఈ నీటిని బాగా మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా మారి వాటిలోని పోషకాలు నీటిలోకి చేరుతాయి. తరువాత ఆ నీటిని చల్లార్చి కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవాలి. ఈ నీటిని నిత్యం ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మంచిది.
బార్లీ నీటిని పరగడుపునే తాగితే శరీరంలోని వ్యర్థ విషపదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. పెద్ద పేగును శుభ్రపరచి కోలన్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. హార్మోన్లకు సంబంధించిన వ్యాధులు దరిచేరవు. శరీర వేడి గలవారు బార్లీ నీటిని తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. కీళ్లనొప్పులు, మోకాళ్ల నొప్పులు నుండి ఉపశమనం కలుగుతుంది.