ముందుగా ఒక కప్పులో నాలుగు టీ స్పూన్ల పాలు, 3 టీ స్పూన్ల రవ్వను తీసుకుని మిక్స్ చేసుకుంటే స్క్రబ్ రెడీ అవుతుంది. దీనిని ముందుగా ముఖానికి పట్టించాలి. పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి.
తర్వాత దోసకాయ రసం రెండు స్పూన్లు, తేనె- 5 చుక్కలు, అరటి పండు గుజ్జు - రెండు స్పూన్లు తీసుకుని బాగా మిక్స్ చేసి ఫేస్‌కు అప్లై చేయాలి. 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి.
ఆయిల్ ఫేస్ అయితే ఆరెంజ్ జ్యూస్, ద్రాక్ష రసం, లెమన్ జ్యూస్, టమోటా జ్యూస్ సమానంగా తీసుకుని ముఖానికి మసాజ్ చేస్తే సరిపోతుంది. నార్మల్ స్కిన్ అయితే ఆపిల్ లేదా బొప్పాయి గుజ్జుతో పాలు చేర్చి ముఖానికి పట్టించి మసాజ్ చేయాలి.