వేసవిలో చర్మానికి మేలు చేకూరాలంటే.. జామపండును తీసుకోవడం మరిచిపోకూడదు. జామపండు పలు రకాల వ్యాధుల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ఈ జామపండులో ఎక్కువగా ప్రోటీనులు, కార్బొహైడ్రేట్లు తక్కువగా వుంటాయి. అలాగే కమలా పండులో కంటే ఐదురెట్లు అధికంగా విటమిన్ సి వుంటుంది. ఇది వేసవిలో ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
నీటిలో కరిగే బీసీ విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో లభిస్తుంది. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం ఎక్కువగా ఉండటంతో ఇది డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. ఇంకా జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాకుండా ఆకలి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.