క్యాబేజీలోని సల్ఫొరాఫేన్ క్యాన్సర్ వ్యాధుల్ని అడ్డుకుంటుంది. రొమ్ము క్యాన్సర్ కారణంగా తలెత్తే కంతుల పరిమాణం పెరగకుండా క్యాబేజీలోని ఎపిజెనిన్ అనే రసాయనం అడ్డుకుంటుంది. క్యాబేజీలో అధికంగా ఉండే బీటా కెరోటిన్, ల్యూటెన్, జియాక్సాంథిన్, క్యాంఫెరాల్, క్యుయెర్సిటిన్ వంటివి.. యాంటీ యాక్సిడెంట్లు హృద్రోగాల్ని, కంటి కండరాల బలహీనతను క్యాటరాక్ట్‌ను నిరోధిస్తాయి.
విటమిన్-కె ఎక్కువగా ఉండే వంకాయరంగు, ఎరుపు రంగుల క్యాబేజీ ఆల్జీమర్స్ వచ్చే ప్రమాదాన్ని అడ్డుకుంటుంది. క్యాబేజీలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఎముక సాంద్రతన పెంటి.. ఆస్టియోపారొసిస్‌ని నివారిస్తాయి.