పెరుగు, ఉల్లిపాయతో చద్దన్నం తింటే మేలెంత..?

బుధవారం, 25 జనవరి 2017 (13:16 IST)
ఆధునిక యుగానికి తోడు ఫాస్ట్ ఫుడ్ కల్చర్, టిఫిన్లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్‌లకు అలవాటుపడి చద్దన్నం తినడాన్ని చాలామంది మరిచిపోయేవుంటారు. రాత్రిపూట మిగిలిన అన్నంలో నీటిని పోసి వుంచి.. ఉదయం పూట పెరుగు కలుపుకుని చద్దన్నాన్ని బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకునే వారు ప్రస్తుతం గ్రామాల్లో కొద్దిమందే కనిపిస్తున్నారు. గ్రామాల్లోనూ చద్దన్నం తినే వారి సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతోంది.
 
అయితే చద్దన్నాన్ని పట్టణాల్లో అసలు మరిచిపోయేవుంటారు. అప్పట్లో ఈ చద్దన్నాన్ని ఎంతో ఇష్టంగా తినేవారు. కానీ ఇప్పుడు రాత్రి వేళలో మిగిలిన ఆహారాన్ని పడేస్తున్నారు. కొంతమంది మిగిలిన అన్నాన్ని ఎవరికైనా ఇవ్వడం చేస్తున్నారు. కానీ చద్దన్నం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో చాలామందికి తెలియదు. చద్దన్నంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకోవాలంటే.. చదవండి మరి. 
 
* చద్దన్నం నీరసం, అలసటను దూరం చేస్తుంది. 
* రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 
* అలర్జీ కారకాలను, చర్మ మలినాలను తొలగిస్తుంది.  
* శరీరాన్ని తేలికగా ఉంచుతుంది. 
* చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుని తింటే వేడి త్వరగా పోతుంది.
* అల్సర్, హైబీపిని తగ్గిస్తుంది. 
* చర్మ వ్యాధులను దరిచేరనివ్వదు.

వెబ్దునియా పై చదవండి