ఎప్పుడూ తీక్షణంగా రెప్పవేయకుండా చూస్తూ కళ్ళపై ఒత్తిడి తీసుకురాకండి. ఎవియన్స్, ఎవాన్ వంటి ఐ క్రీములు, జెల్‌లు వాడవచ్చు. ఇటువంటి జాగ్రత్తలు పాటించినా కళ్ళకింద వలయాలు పోకపోతే చర్మ సౌందర్యానికి సంబంధించిన వైద్యనిపుణులను సంప్రదించండి. కళ్ళ కిందభాగం ఉబ్బినట్టు ఉంటే రెండు టీ బ్యాగులను వేడినీటిలో కొంచెం సేపు నాంచి ఆ తర్వాత వాటిని కళ్ల మీద 20 నిమిషాలపాటు పెట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది.