కరోనా వైరస్ ఇంటికి రాకుండా.. ఇంకా మనల్ని సోకకుండా వుండాలంటే.. శుభ్రత పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ ప్లాస్టిక్, ఉక్కు ఉపరితలాలపై 72గంటలు అంటే మూడు రోజులపాటు సజీవంగా జీవించగలదు. రాగిలో 4 గంటలు, కార్డ్‌బోర్డ్‌లో 24గంటల వరకు జీవిస్తుందని చెప్తున్నారు. లోహ, గాజు మిగతా నిర్జీవ ఉపరితలాలపై తొమ్మిది రోజుల వరకు జీవించగలవు.