పుదీనా టీ అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా?

బుధవారం, 14 సెప్టెంబరు 2022 (23:32 IST)
పుదీనా టీ కెఫిన్ లేనిది అనేది తెలిసిన విషయమే. ఈ టీ తాగడం వల్ల జలుబు, ముక్కు కారడం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే దీనిని అతిగా సేవిస్తే మాత్రం హానికరం. ఎందుకంటే... పుదీనా టీని మోతాదుకి మించి తీసుకోవడం వల్ల క్రింది దుష్ప్రభావాలను చూపిస్తుంది.

 
శరీరంలో షుగర్ స్థాయిలను తగ్గిస్తుంది. పుదీనా టీ డయాబెటిక్ మందులతో కూడా సంకర్షణ చెందుతుంది. కాబట్టి మధుమేహం ఉన్న వ్యక్తులు ఈ టీకి దూరంగా ఉండాలి. వైద్యుడిని సంప్రదించిన తర్వాత తీసుకోవాలి.

 
పుదీనా టీ దుష్ప్రభావాలలో అలెర్జీ కూడా ఒకటి. ఈ టీ పడనివారిలో తలనొప్పి, కాళ్లు తేలిపోయినట్లు వుండటం, నోటిలో పుండ్లు వంటివి రావచ్చు. ఇవి పుదీనా టీ తాగినప్పుడు కలిగితే మాత్రం దానిని ఆపేయడం మంచిది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు