అసలే వేసవి కాలం. ఎండలు వేడెక్కిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అప్పుడే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వేసవిలో నీటిశాతం ఎక్కువగా వుండే పండ్లను తీసుకోవాలని అందరికీ తెలుసు. అందుకే పుచ్చకాయ, కీరదోస, కొబ్బరిబోండాం వంటివి తీసుకుంటుంటాం. అయితే వీటితో పాటు కొన్ని పండ్లను తీసుకుంటే వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆ పండ్లు ఏంటో ఓసారి చూద్దాం..
వీటితో పాటు ఎండు ద్రాక్షను రోజూ తీసుకుంటే వేసవికాలంలో ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఎండుద్రాక్షలను బాగా నీటిలో కడిగి.. ఆవు పాలలో వేసి మరిగించి ఆరనివ్వాలి. ఆపై పాలలో మరిగించిన ద్రాక్షలను తీసుకుంటే.. ఆ పాలను తీసుకుంటే అజీర్తి సమస్యలు వుండవు. ఇందులోని క్యాల్షియం.. ఎముకలకు, దంతాల బలానికి సహకరిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.