ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీరు తాగటం ప్రాణాంతకం అనే ప్రచారం ఇప్పుడు నగరాల్లో బాగా పుంజుకుంటోంది. కేన్సర్ కారకమైన ప్లాస్టిక్ బాటిల్స్‌లో మంచినీటిని తాగడం ఆపివేసి రాగి బాటిల్స్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలనే ప్రచారం వ్యాప్తి చెందుతోంది. కాస్త ఖరైదనప్పటికీ ఒకసారి కొంటే జీవితమంతా ఉపయోగపడే రాగి సీసా ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి హామీ ఇస్తుందని సినీ నటి రాశీ ఖన్నా అన్నారు హైదరాబాద్‌లోని మాదాపూర్ ఎనకన్వెన్షన సెంటర్‌లో జరిగిన డాక్టర్ కాపర్ వాటర్ బాటిల్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారామె.
డాక్టర్ కాపర్ వాటర్ బాటిల్ రూపొందించిన ఎంఎస్‌ఆర్ ఇండియా లిమిటెడ్ సీఈవో మల్లారెడ్డి మాట్లాడుతూ ‘‘నాలుగేళ్ల శ్రమ ఫలితమే ఈ బాటిల్. ఎక్కడా అతుకులు లేకుండా, ఏ విధమైన లీకేజీకు అవకాశం లేకుండా చక్కటి డిజైనతో దీన్ని రూపొందించాం అన్నారు. ఎంఎస్‌ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కేవీ రాజశేఖర్ రెడ్డిమాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం చేరువ చేయాలనే తలంపుతో 799 రూపాయలకే ఈ బాటిల్ అందిస్తున్నామన్నారు.