ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

సిహెచ్

శనివారం, 28 సెప్టెంబరు 2024 (21:34 IST)
ఈరోజుల్లో కూర్చుని చేసే పనులు ఎక్కువయ్యాయి. శారీరక శ్రమ తగ్గింది. దానికి తగ్గట్లుగా ఆహారపు అలవాట్ల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు పెరగకుండా, బరువు పెరగకుండా వుండేట్లు చూసుకోవాలి. అది ఎలాగో తెలుసుకుందాము.
 
రోజూ తినే ఆహారంలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. ఇది కొవ్వును క‌రిగించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.
పసుపు వాడుతుంటే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది.
యాలకులతో జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తొలగిస్తుంది. 
బరువు తగ్గించేందుకు కరివేపాకులు శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు, చెడుకొవ్వును తొలగిస్తాయి.
వెల్లుల్లి‌లోని యాంటీ బ్యాక్టీరియల్ యాసిడ్స్ కొవ్వును బాగా క‌రిగిస్తాయి.
వంట నూనెల్లో రారాజు ఆలివ్ ఆయిల్. ఇందులోనే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
క్యాబేజీని తినే వారిలో కొలెస్ట్రాల్ మోతాదు తక్కువగా ఉంటుంది.
 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు