తెల్లసొనతో ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఎగ్‌వైట్ కోసం ఉపయోగించిన ఫేస్ ప్యాక్స్ అదనపు ఆయిల్‌ను తొలగించేందుకు బాగా ఉపయోగపడతాయి. ఎగ్‌వైట్‌ను ముఖానికి ప్యాక్ మాదిరిగా వేసుకుని ఆరనివ్వాలి. కానీ ఎగ్‌వైట్ ముఖానికి అప్లే చేసుకుంటే.. ఆరేంతవరకు మాట్లాడకూడదు. ముఖాన్ని కదపకుండా అలానే వుండాలి. ఈ ప్యాక్ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఎగ్‌వైట్‌లో తేనె, పాలు కలుపుకున్నా చర్మ సౌందర్యం మెరుగవుతుంది.